తెలంగాణలో కొత్తగా 494 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. 710 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,405 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,41,153కు చేరుకున్నాయి. 24 గంటల వ్యవధిలో నలుగురు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,784కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 710 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,27,964కి చేరుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,405 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 15, జీహెచ్ఎంసీ 76, జగిత్యాల 24, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 5, కామారెడ్డి 0, కరీంనగర్ 49, ఖమ్మం 40, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 12, మంచిర్యాల 11, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 19, ములుగు 4, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 19, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 6, పెద్దపల్లి 30, సిరిసిల్ల 12, రంగారెడ్డి 31, సిద్దిపేట 14, సంగారెడ్డి 12, సూర్యాపేట 14, వికారాబాద్ 1, వనపర్తి 3, వరంగల్ రూరల్ 18, వరంగల్ అర్బన్ 43, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…