మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జడ్చర్ల మండలం నస్రూల్లాబాద్ వద్ద ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో నలుగురు మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని శంకర్, నరేశ్, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. వీరి మరణంతో కుటుంబసభ్యులు, బంధువుల్లో విషాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read:చెత్త ఉందని అటు వెళ్తే... దూసుకొచ్చిన మృత్యువు:పెళ్లింట విషాదం

కాగా మంగళవారం హైదరాబాద్ చందానగర్‌లో ఎంఎంటీఎస్ ఢీకొని ఇద్దరు యువతి యువకులు మరణించారు. మృతులను సోనీ, మనోహర్‌లుగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరికి కొద్దిరోజుల క్రితమే వీరికి వివాహం నిశ్చితార్ధమైంది, ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.

దీనిలో భాగంగా పెళ్లి షాపింగ్ కోసం చందానగర్ అండర్‌పాస్ చెత్తాచెదారంతో నిండిపోవడంతో కింది నుంచి వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ జంట పట్టాల పైనుంచి అవతల పక్కనున్న రోడ్డుమీదకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో వేగంగా వచ్చిన ఎంఎంటీఎస్ ఢీకొట్టడంతో వీరిద్దరు అక్కడికక్కడే మరణించారు. దీనిపై పాపిరెడ్డినగర్‌కు చెందిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అండర్‌పాస్ వద్ద చెత్తను తొలగించివుంటే ఈ దారుణం జరిగేది కాదని వారు వాదిస్తున్నారు.

Also Read;దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో వివాహం ఉండటంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ఇరు కుటుంబాల్లో సోనీ, మనోహర్‌ల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.