హైదరాబాద్: హైద్రాబాద్‌లోని నాగోల్ బండ్గగూడ వేల్పేర్ హాస్టల్ లో 38 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలను ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి తెరిచారు.  విద్యాసంస్థల్లో  కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

విద్యాసంస్థల్లో జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ  కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాగోల్ బండ్లగూడ మైనార్టీ హాస్టల్ లో  38 మంది విద్యార్ధినులకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో కొందరికి పరీక్షలు నిర్వహించడంతో  ఈ విషయం వెలుగు చూసింది.

కరోనా సోకిన విద్యార్ధులను క్వారంటైన్ కు పరిమితం చేశారు. గతంలో కూడ  ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్ లో 30 మందికి పైగా విద్యార్ధులు కరోనా బారినపడ్డారు.