తెలంగాణలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 405 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,246 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 357 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,56,455కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 3,865కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 405 మంది కోలుకోవడం ద్వారా తెలంగాణలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,46,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,246 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 7, జీహెచ్ఎంసీ 96, జగిత్యాల 12, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 33, ఖమ్మం 16, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 8, మంచిర్యాల 9, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 4, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 21, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 12, సిరిసిల్ల 8, రంగారెడ్డి 17, సిద్దిపేట 8, సంగారెడ్డి 6, సూర్యాపేట 8, వికారాబాద్ 4, వనపర్తి 5, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 21, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…