తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 340 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,470 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 75,199 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 315 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,60,786కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వీటితో కలిపి తెలంగాణలో మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 3,891కి చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 340 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 5,470 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 83, జగిత్యాల 14, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 20, ఖమ్మం 15, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 3, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 21, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 5 , పెద్దపల్లి 13, సిరిసిల్ల 6, రంగారెడ్డి 17, సిద్దిపేట 8, సంగారెడ్డి 5, సూర్యాపేట 9, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 21, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…