Asianet News TeluguAsianet News Telugu

దీపావళి బాణసంచా ఎఫెక్ట్: తెలంగాలో 31 మందికి గాయాలు


దీపావళి బాణసంచా కాలుస్తూ గాయపడిన 31 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నారు. ఇందులో ఒకరు కన్ను కోల్పోయారు. ఇద్దరికి శస్త్రచికిత్స చేశారు. మిగిలినవారికి చికిత్స అందించి ఇంటికి పంపారు.
 

31 people suffer eye injury due to fireworks on Diwali in Telangana
Author
Hyderabad, First Published Nov 5, 2021, 12:04 PM IST

హైదరాబాద్: దీపావళి సందర్భంగా crackery కాలుస్తూ 31 మంది గాయపడ్డారు. వీరంతా చికిత్స కోసం  Hyderabad సరోజిని దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.Diwali ని పురస్కరించుకొని బాణసంచా కాలుస్తుంటారు. అయితే టపాకాయలు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  గురువారం నాడు దీపావళి టపాకాయాలు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసకోని కారణంగా 31 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైద్రాబాద్ సరోజిని కంటి ఆసుపత్రిలో ఇన్‌పేషేంట్లుగా చేర్చుకొన్నారు వైద్యులు.మిగిలిన వారంతా సరోజినిదేవి ఆసుపత్రిలో ఔట్ పేషేంట్లు గా వచ్చి చికిత్స తీసుకొని వెళ్లిపోయారు.

తీవ్రంగా గాయపడిన వారిలో ఇధ్దరికి  శస్త్రచికిత్స నిర్వహించారు. హైద్రాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన రాజ్ తివారీకి కన్ను కోల్పోయాడు.బాణసంచా విక్రయాలపైTelangana ప్రభుత్వం ఇటీవలనే కీలక ఉత్తర్వులు ఇచ్చింది. బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

బాణసంచాను నిషేధించాలని ఓ పర్యావరణ వేత్త దాఖలు చేసిన పిటిషన్ పై కోల్‌కత్తా హైకోర్టు గత నెల 29న కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్ కాకర్స్ ను గుర్తించే మెకానిజం కూడా పోలీసుల వద్ద లేదని అందుకే మొత్తం క్రాకర్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి క్రాకర్స్ ను కాల్చడానికి ప్రత్యేక సమయాన్ని, గడువును సూచించింది. కానీ ఈ సూచలను కోల్‌కత్తా హైకోర్టు తోసిపుచ్చింది.

బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకొంది. గాలిలో నాణ్యత లేని కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతు దురద, కళ్లలో  మంటతో ప్రజలు  ఆసుపత్రులకు చేరుతున్నారు. బాణసంచాపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ టపాకాయలు కాల్చడాన్ని ఎవరూ ఆపలేదు. దీంతో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకొంది. ఈ నెల 7వ  తేదీ నాటికి కాలుష్యం కొంచెం తగ్గే అవకాశం ఉందని  కాలుష్య నియంత్రణ అధికారులు తెలిపారు.

also read:దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయు కాలుష్యం

టపాకాయలపై నిషేధం ఉన్న సమయంలో నిషేధాన్ని సక్రమంగా అమలు చేసే విషయంలో అధికారులు సరిగా వ్యవహరిస్తే  వాయు కాలుష్యంతీవ్ర పెరిగే అవకాశం ఉండేది కాదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.గతంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ నగరాల్లో వాయు కాలుష్యం తగ్గిందని అధికారులు అప్పట్లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో పరిస్థితి యధాతథస్థితికి చేరుకొంది.వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడ కరోనా లాక్‌డౌన్ సమయంలో తగ్గింది. గంగా, యుమున నదుల్లో కాలుష్యం తగ్గింది. కాలుష్యం  తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios