అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని హైకోర్టులో గురువారం నాడు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఎన్నికలు జరపకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సెలవుపై వెళ్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని  కోర్టు ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎల్లుండి  విచారణ జరపనున్నట్టుగా ఏపీ హైకోర్టు ప్రకటించింది.

ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్  రాష్ట్రగవర్నర్ ను బుధవారం నాడు కలిశారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవు కోసం ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే కొన్ని కారణాలతో సెలవులను రద్దు చేసుకొని తిరిగి విధుల్లో చేరారు.