సింగరేణి గని ప్రమాదం... ముగ్గురు అధికారులపై వేటు, మృతుల పిల్లలకు త్వరలోనే ఉద్యోగాలు

శ్రీరాంపూర్ (srirampur) సింగరేణి గని (singareni mine accident) ప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్ అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్‌వైజర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

3 officials suspended for singareni mine collapse mishap

శ్రీరాంపూర్ (srirampur) సింగరేణి గని (singareni mine accident) ప్రమాదం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్ అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్‌వైజర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా గని మేనేజర్‌కు ఛార్జీషీట్ దాఖలు చేశారు అధికారులు. వారంలోగా మృతుల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది. 

ALso Read:అధికారుల నిర్లక్ష్యంతోనే సింగరేణి గని ప్రమాదం.. చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్

కాగా.. మంచిర్యాల జిల్లాలోని (mancherial district) సింగరేణి శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 భూగర్భ గనిలో బుధవారం పెద్ద ప్రమాదం జరిగింది. పై కప్పు కూలి పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పై కప్పులో పగుళ్లు ముందుగానే గమనించిన అధికారులు రక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. టన్నుల కొద్దీ బరువైన బండ మీదపడడంతో వారికి ప్రాణాలు దక్కించుకొనే అవకాశం లేకుండా పోయింది. నలుగురు కార్మికులూ శిథిలాల కింద నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మరణించారు. సింగరేణిలో చాలాకాలం తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. మృతులను ఒంటెల క్రిష్ణారెడ్డి (58), బేర లక్ష్మయ్య (60), బదిలీ వర్కర్లు గడ్డం సత్య నర్సింహరాజు (32), రెంక చంద్రశేఖర్‌ (32)లుగా గుర్తించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios