అధికారుల నిర్లక్ష్యంతోనే సింగరేణి గని ప్రమాదం.. చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్
మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.
మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. అందులో చిక్కుకుపోయిన ఓ కార్మికుని మృతదేహాన్ని బయటకు తీశారు. మరో మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. మృతులను కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్(29), నర్సింహరాజు(30)గా గుర్తించారు. అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.