నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం బడా భీంగల్‌లో బైక్‌ను ఢీకొట్టిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరోకరి పరిస్ధితి విషమంగా వుంది.

మృతులను రాజన్న, భూమయ్య, భూదేవిగా గుర్తించారు. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారించారు.

డ్రైవర్ సహా కారులో ఐదుగురు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు డ్రైవర్ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.