తెలంగాణ (Telangana)లో కొత్తగా 134 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 164 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,980 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 32,621 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా, 134 మందికి (corona cases) పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు వెల్లడయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, ఒకరు ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 6,74,452 మంది కోవిడ్ బారినపడగా... 6,66,846 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,626 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 3,980కి పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 44, జగిత్యాల 6, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 5, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మంచిర్యాల 2, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 3, రంగారెడ్డి 14, సిద్దిపేట 3, సంగారెడ్డి 3, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 5, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…