ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ ని కించ పరుస్తూ... ఓ మహిళ టిక్ టాక్ వీడియో చేసింది. కాగా... ఆ వీడియో చేసిన మహిళపై మరి కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం జగన్‌పై టిక్‌టాక్‌ వేదికగా అభ్యంతర కామెంట్లు చేయడం.. పలువురు మహిళల మధ్య గొడవకు కారణమైంది. టిక్‌టాక్‌లో జగన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై పలువురు మహిళలు పరస్పరం గొడవకు దిగారు. ఇది కాస్తా పెరిగి పెద్దదవడంతో పరస్పరం ఒకరిపై ఒకరు ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Also Read వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్ ఆవరణలోనే గర్భిణీ ప్రసవం.

ఎస్సార్ నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. జగన్ ని కించపరుస్తూ టిక్ టాక్ వీడియోలు చేసుకున్న మహిళను స్వరూప గా గుర్తించామని వారు చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.