వచ్చే డిసెంబర్ 9 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ కాలెండర్ ను తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాని ప్రకారం 2024 డిసెంబర్ 9 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.

2 lakh jobs to be filled by December 9 next year: CM Revanth Reddy ISR

వచ్చే ఏడాది డిసెంబర్ డిసెంబర్ 9 నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టీఎస్పీఎస్సీ ద్వారా ఆ ఉద్యోగాలను నింపుతామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు స్థానంలో తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకోస్తుందని అన్నారు. అయితే దీనిపై పరిమితి విధించి అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొని, తరువాత దానిని అమలు చేస్తామని తెలిపారు.

తెలంగాణ సచివాలయంలో బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో జాప్యానికి ప్రస్తుత టీఎస్ పీఎస్సీ సభ్యుల రాజీనామాల ఆమోదం పెండింగ్ లో ఉండటమే కారణమని తెలిపారు. చైర్మన్ లేకుండా తాము ఏమీ చేయలేమని సీఎం తెలిపారు. సభ్యులందరూ రాజీనామాలు సమర్పించారని, అవి ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఆ విషయంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత వాటిని ఆమోదిస్తారని అన్నారు. నియామకాల్లో పారదర్శకత కోసం కొత్త బోర్డును నియమిస్తామని చెప్పారు.

ఈ జాప్యంపై నిరుద్యోగ యువత నిరుత్సాహానికి గురి కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేస్తామని, దాని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుభ రోసాపై గరిష్ఠ పరిమితి, కౌలు రైతులకు కలిగే ప్రయోజనాలపై ఈ సందర్భంగా సీఎం స్పందించారు. ప్రస్తతానికి రైతు భరోసాకు పరిమితి పెట్టాలనే ప్రణాళికలు లేవని అన్నారు.

పరిమితి విధించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. తరువాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో గత ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి మార్చి 31 వరకు రైతుబంధు మొత్తాలను పంపిణీ చేసేదని సీఎం గుర్తు చేశారు. కాబట్టి పంపిణీలో జాప్యం జరగబోదని అన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఎండిపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. కాబట్టి హామీల అమలకు తమకు కొంత సమయం కావాలని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios