తెలంగాణ (Telangana)లో కొత్తగా 172 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 188 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,625 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 172 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,79,892కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 4,016కు చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 188 మంది కోలుకున్నారు . వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,72,251కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 3,625 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 726 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,122 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 59 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 22 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ రాగా.. మిగిలిన వారిలో 24 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 53, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 3, ఖమ్మం 11, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0 మంచిర్యాల 5, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 22, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 5, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 2, సిరిసిల్ల 1, రంగారెడ్డి 14, సిద్దిపేట 12, సంగారెడ్డి 3, సూర్యాపేట 0, వికారాబాద్ 0, వనపర్తి 4, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 3, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…