Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ఉప్పుగూడలో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం..

హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అలీ తన స్నేహితుడు అర్బాస్‌తో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

17 years old girl raped by two youth in hyderabad uppuguda
Author
First Published Jun 23, 2022, 3:54 PM IST

హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అలీ తన స్నేహితుడు అర్బాస్‌తో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు అలీ, అర్బాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బాధిత బాలికకు నిందితుడు అలీ ముందే తెలుసని.. ఆమెతో ఉన్న స్నేహాన్ని అదునుగా తీసుకుని స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో నలుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులు బాలికను ఆమె ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి అత్యాచారం జరిపినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు. బాలికను వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్‌ కోసం భరోసా కేంద్రానికి పంపారు. తొలుత కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత గ్యాంగ్ రేప్ ఆరోపణలతో.. కిడ్నాప్ నుంచి గ్యాంగ్ రేప్ కేసుగా మార్చారు. నలుగురు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొందని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. 

అసలేం  జరిగిందంటే.. ఈనెల 18న చాంద్రాయణగుట్టలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బాలిక బయలుదేరింది. అయితే ఆ బాలిక అక్కడికి వెళ్లలేదు. బాలిక ఆచూకీ తెలియక పోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు చాంద్రాయణ గుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  ఆ మరుసటి రోజు ఆదివారం రాత్రి బాలికి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా తనపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios