Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో 106 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,72,052కి చేరిన మొత్తం కరోనా కేసులు

తెలంగాణ (Telangana)లో కొత్తగా 164 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 171 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,969 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

164 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Nov 10, 2021, 10:06 PM IST

తెలంగాణలో (telangana) గడిచిన 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు (corona cases in telangana) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 171 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. మరోవైపు కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,72,987కి చేరుకుంది. తాజా రికవరీలతో కలిపి మొత్తం 6,65,272 మంది కరోనా నుంచి కోలుకున్నట్లయ్యింది. ఇప్పటి వరకు 3,969 మంది వైరస్‌తో (covid deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 55, జగిత్యాల 4, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 10, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 3, మంచిర్యాల 3, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 4, సిరిసిల్ల 3, రంగారెడ్డి 10, సిద్దిపేట 4, సంగారెడ్డి 7, సూర్యాపేట 1, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios