హైదరాబాద్ కాచిగూడ పరిధిలోని తిలక్ నగర్‌లో 15 ఏళ్ల బాలిక మిస్ అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తిలక్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. తిలక్ నగర్, ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. 

హైదరాబాద్ కాచిగూడలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్‌లో 15 ఏళ్ల బాలిక మిస్ అయ్యింది. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిలక్ నగర్, ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తిలక్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రమ్య అంబర్‌పేట్ పోలీస్ లైన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.