యువతులు, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కస్తూర్భాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 14మంది యువతులు పరారయ్యారు. అర్థరాత్రి కిటికీ ఊచలు కట్ చేసి వీరు పారిపోయారు.
నార్సింగి : గండిపేట మండలం హైదర్షాకోట్ లోని Kasturba Gandhi national memorial Trust నుంచి 14 మంది women శుక్రవారం అర్థరాత్రి పరారయ్యారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని వివిధ పరిధిలో పట్టుబడిన యువతులు, మహిళలను పోలీసులు కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్టులో చేర్చుతారు. భద్రత మధ్య ఒక hall లో 18 మందిని ఉంచారు.
శుక్రవారం తెల్లవారుజామున 2గం.ల సమయంలో bathroomలో కిటికీ ఊచలు కట్ చేసి 15 మంది పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒక యువతికి స్వల్పగాయం కావడంతో అక్కడే ఉండిపోయింది. మిగిలిన 14మంది పరారయ్యారు. ఉదయం గుర్తించిన మేనేజర్లు రామకృష్ణమూర్తి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ రవీందర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, జనవరి 27న ఓ వివాహిత ఇలాగే పరార్ అయ్యింది. haryanaలో ఓ భార్య కట్టుకున్న husbandనే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించింది. అతను చనిపోయాడనుకుని, cash and jewelleryతో ఉడాయించింది. ఆమెను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు పురుషుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన Faridabadలో జనవరి 17 -18 మధ్య రాత్రి జరిగింది. ఆ మహిళ భర్తను చంపడానికి ప్రయత్నించి, నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పారిపోయిందని తేలింది. దీనికోసం మహిళ భర్త ఆహారంలో sedatives కలిపి.. అతని మీద దాడి చేసింది. అరవకుండా నోట్లో దుప్పటి కుక్కి తీవ్రంగా గాయపరిచింది. అని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
మత్తుమందుతో బాధితుడు మైకంలో ఉన్నప్పుడు ఇద్దరు పురుషులతో కలిసి మహిళ సుమారు 20 నిమిషాల పాటు అతని మీద దాడి చేసింది. అచేతనంగా పడి ఉన్న అతను చనిపోయాడని భావించిన వారు ఇంటిని దోచుకున్నారు. నగదు, నగలు, ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయారు.
ఆ రాత్రి ఏం జరిగిందంటే...: ఈ ఘటన జరిగిన జనవరి 17, 18వ తేదీ మధ్య రాత్రి భోజనానికి ముందు దంపతుల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే 45 ఏళ్ల బాధితుడు తన భార్యతో నిత్యం గొడవపడేవాడని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) నరేందర్ కడియన్ పేర్కొన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ తరువాత భార్య భర్త ఆహారంలో మత్తుమందు కలిపింది. అది తిన్న భర్త మత్తులోకి జారుకోగానే.. భర్త ముఖాన్ని దుప్పటితో కప్పి.. దాదాపు 20 నిమిషాల పాటు కొట్టింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే పోలీసుల కథనం ప్రకారం, బాధితుడు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం గురించి తెలుసుకున్నాడు. ఇద్దరిమధ్య కొద్దిరోజులు గొడవలు అయ్యి, పరిస్థితులు మళ్లీ మామూలు అయ్యాయి. అయితే బాధితుడు భార్య ఫోన్ చెక్ చేసినప్పుడు అవతలి వ్యక్తి తన అప్పులు తీర్చడానికి త్వరగా డబ్బు సంపాదించాలని.. ఆమెను పెట్టిన మెసేజ్ లు కనిపించాయి.
మత్తు మందుతో....: ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆ మహిళ తన భర్తకు ఆహారంలో మత్తుమంది కలిపి ఇవ్వడం వల్ల.. అతనికి కళ్లు తిరగడం మొదలై నిద్రపోయాడయని పోలీసు అధికారి తెలిపారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు మేల్కొన్నప్పుడు, అతని శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. ఒళ్లంతా నొప్పులుగా మారిపోయింది. దీంతో జరిగిన విషయం అతనికి బోధపడింది. వెంటే పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో నగదు, నగలు, విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడం..భార్య ఆచూకీ కోసం ప్రయత్నించినా ఆమె కనిపించలేదని పోలీసులకు తెలిపారు.
