హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్   పరిధిలో  కొత్తగా  మహిళా, ట్రాఫిక్ , శాంతిభద్రతల  పోలీస్ స్టేషన్లను  ఏర్పాటు  చేయనున్నారు.ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.  

హైదరాబాద్: హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ చేసింది. కొత్తగా 13 పోలీస్ స్టేషన్లతో పాటు మరో 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఆరు మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం వివరించింది. కొత్త పోలీస్ స్టేషన్ల డివిజన,్ జోన్ హద్దులను అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరకు కొత్త పోలీస్ స్టేషన్లలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కుఅవసరమై న భవనాల కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. మరో వైపు కొత్త పోలీస్ స్టేషన్లలో సీఐ, ఎస్ఐ, ఇతర సిబ్బంది నియామకం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దోమలగూడ , లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్ , వారాసిగూడ, తాడ్బన్ , బండ్లగూడ, ఐఎస్ సదన్ , టోలి చౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్ , ఫిల్మ్ నగర్ , రహమత్ నగర్, బోరబండలలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్ కు ఒకటి చిప్పున మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మహిళా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక ఉమెన్ సేఫ్టీ వింగ్ జోన్ ఏర్పాటు చేయనున్నారు.