తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు డిసెంబర్ 9వ తేదీ నుండి ఇప్పటివరకు 1200 మంది వచ్చినట్టుగా గుర్తించారు. వీరిలో 200 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు.
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు డిసెంబర్ 9వ తేదీ నుండి ఇప్పటివరకు 1200 మంది వచ్చినట్టుగా గుర్తించారు. వీరిలో 200 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరుగురు వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలానికి ముగ్గురు వచ్చారు. తల్లిదండ్రులతో పాటు వారి కూతురు యూకే నుండి వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు. వీరి నుండి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
also read:బ్రిటన్ నుండి కరీంనగర్ కు 16 మంది: శాంపిల్స్ సేకరణ, మరో ఆరుగురి కోసం గాలింపు
నిర్మల్ జిల్లాకు ఇద్దరు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 13న ఒకరు, డిసెంబర్ 19న మరొకరు నిర్మల్ జిల్లాకు వచ్చారని అధికారులకు ఎయిర్ పోర్టు నుండి సమాచారం అందింది. వీరి నుండి వైద్యాధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఒకరు వచ్చారు. అతను ఆదిలాబాద్ నుండి పుణెకు వెళ్లినట్టుగా వైద్యులు గుర్తించారు. పుణెకు వెళ్లిన వ్యక్తి నుండి శాంపిల్స్ సేకరించేందుకు మహారాష్ట్ర అధికారులకు సమాచారం పంపారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 16 మంది బ్రిటన్ నుండి వచ్చినట్టుగా గుర్తించారు. వీరిలో 10 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లాకు 270 మంది బ్రిటన్ నుండి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ జిల్లాలో కేవలం 70 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. మిగిలినవారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లో సుమారు 400 వందలకు పైగా ఉన్నారని సమాచారం.
