ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  కొత్త రకం వైరస్ నేపథ్యంలో బ్రిటన్ నుండి 16 మంది కరీంనగర్ రావడంతో వైద్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటన్ నుండి వచ్చిన వారి శాంపిల్స్ ను వైద్యులు సేకరించారు.

కొన్ని రోజుల క్రితం బ్రిటన్ నుండి కరీంనగర్ కు 16 మంది వచ్చినట్టుగా వైద్యశాఖాధికారులు గుర్తించారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ 10 మంది నుండి రక్త నమూనాలను సేకరించారు. బ్రిటన్ లో నే స్ట్రెయిన్ వైరస్ బయటపడింది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. 
 

దీంతో బ్రిటన్ కు విమాన రాకపోకలపై నిషేధించారు. మరోవైపు ఇండియా కూడ ఈ నెలాఖరు వరకు కూడ బ్రిటన్ కు ఇండియా కూడ విమానాలను నిషేధించింది.

బ్రిటన్ నుండి వచ్చినవారిలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా లక్షణాలు కన్పించలేదని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో తొలుత ఉమ్మడి కరీంనగర్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మర్కజ్ నుండి వచ్చిన వారి నుండి  కరీంనగర్ లో కరోనా సోకిన  విషయం తెలిసిందే. ఇదే జిల్లాలో బ్రిటన్ నుండి వచ్చిన వారు కూడ కరీంనగర్ లో 16 మంది ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో 10 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. మరో ఆరుగురి కోసం   గాలింపు చర్యలు  చేపట్టారు.