తెలంగాణలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. ప్రజలను వైరస్ బారి నుంచి కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైద్యులు, పోలీసుల సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా తేలింది.

ఇటీవలే సదరు కానిస్టేబుల్‌కు కొడుకు పుట్టాడు. అయితే తనకు కరోనా సోకిందన్న విషయం తెలియని అతను.. కొడుకు పుట్టిన సంతోషంలో స్వీట్లు పంచాడు. దీంతో అతని వద్ద నుంచి స్వీట్లు తిన్న 12 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు కానిస్టేబుల్ సోదరుడికి కూడా వైరస్ సోకింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read:తెలంగాణ ప్రైవేట్ ల్యాబుల నిర్వాకం: 3వేల కరోనా పేషెంట్స్ మిస్సింగ్!

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కి చేరింది.

వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 1,658 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 8 మంది వైరస్ కారణంగా మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 283కి చేరుకుంది. తెలంగాణలో శుక్రవారం 1,126 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,195కు చేరింది.

Also Read:కరోనా ఘోరాలు.. మరో వీడియో వైరల్..

హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి 56, మేడ్చల్ 44, సంగారెడ్డి 20, మహబూబ్‌‌నగర్‌లలో 12, సిరిసిల్ల 6, కామారెడ్డి 6, నల్గొండ 13, వరంగల్ (రూరల్) 41, వనపర్లి 5, కొత్తగూడెం 4, మహబూబాబాద్ 7, మెదక్ 3, నిజామాబాద్ 3, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్ అర్బన్, జగిత్యాల, ములుగులలో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదయ్యాయి.