Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రైవేట్ ల్యాబుల నిర్వాకం: 3వేల కరోనా పేషెంట్స్ మిస్సింగ్!

గత పది రోజులుగా తెలంగాణలోని వివిధ ప్రైవేట్ ల్యాబుల్లో పాజిటివ్ గా తేలిన వారి వివరాలను ప్రైవేట్ ల్యాబులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ మూడువేల మందికి సంబంధించిన వివరాలు అందకపోగా వారికి సంబంధించిన 6వేల మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను ఇప్పుడు ఎలా ట్రేస్ చేయాలిరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు అధికారులు. 

Over 3000 COVID Cases Being Untraceable In Hyderabad
Author
Hyderabad, First Published Jul 4, 2020, 5:48 PM IST

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబులకు పరీక్షల కోసం అనుమతులు ఇవ్వడంతో అది తెలంగాణ ప్రభుత్వానికి నూతన తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ఇప్పటికే హిమాయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ ల్యాబులో టెస్టింగ్ ప్రొటొకాల్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల ఒక్క రోజులో ఒకే ల్యాబులో 70 శాతం పైచిలుకు పాజిటివిటీ రేటు వచ్చిన విషయం తెలిసిందే!

గత పది రోజులుగా తెలంగాణలోని వివిధ ప్రైవేట్ ల్యాబుల్లో పాజిటివ్ గా తేలిన వారి వివరాలను ప్రైవేట్ ల్యాబులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ మూడువేల మందికి సంబంధించిన వివరాలు అందకపోగా వారికి సంబంధించిన 6వేల మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ను ఇప్పుడు ఎలా ట్రేస్ చేయాలిరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు అధికారులు. 

కరోనా రోగులను టెస్ట్‌ చేయడం, ట్రేసింగ్, చికిత్స చేయడం వంటి అంశాల గురించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రోజు జరిపే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన అతడు / ఆమె వివరాలను పరీక్షాకేంద్రాలు ప్రభుత్వానికి, కోవిడ్‌-19 పోర్టల్‌కు నివేదిస్తారు. 

ఆ సదరు పేషెంట్ కి యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ సదరు పేషెంట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ను ట్రేస్‌ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుంటుంది. 

ప్రైవేట్ ల్యాబ్స్ టెస్ట్స్ నిర్వహించిన తరువాత రిపోర్టులు ఇచ్చాక, రోగుల మిగిలిన డీటెయిల్స్ ని కాలేచ్ట్ చేయలేదు. వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించి వారికి ఒక యూనిక్ ఐడిని క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. దీనితో ఇప్పుడు ఆ పాజిటివ్ సోకిన పేషెంట్స్ ఎక్కడ తిరుగుతున్నారో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టు ఫలితాలు వెంటనే వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఈ ల్యాబులను ఆదేశించారు. ఈ ల్యాబులకు నోటీసులను పంపినప్పటికీ... ఈ కరోనా పాజిటివ్ పేషంట్లను ఇప్పుడు వెతికి పట్టుకోవడం, వారి ప్రైమరీ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేయడం అధికారుల ముందున్న అతిపెద్ద సవాలు. 

Follow Us:
Download App:
  • android
  • ios