Asianet News TeluguAsianet News Telugu

108ఏళ్ల బామ్మకి కరోనా వ్యాక్సిన్..!

తాజాగా తెలంగాణలో ఓ 108ఏళ్ల బామ్మ వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన గుజ్జ వెంటమ్మ(108) బుధవారం ఈఎన్టీ హాస్పిటల్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు.

108-year-old takes jab, oldest in Telangana
Author
Hyderabad, First Published Mar 18, 2021, 10:07 AM IST


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. దీనికారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా.. ఇటీవల దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలుత కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ అందించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.

కాగా.. తాజాగా తెలంగాణలో ఓ 108ఏళ్ల బామ్మ వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన గుజ్జ వెంటమ్మ(108) బుధవారం ఈఎన్టీ హాస్పిటల్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారందరిలో  ఈమె అత్యధిక వయస్కురాలు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఆమె ఆధార్ కార్డ్ లో ఉన్న వివరాల ప్రకారం.. సదరు మహిళ 1913లో జన్మించినట్లు తెలుస్తోంది. ఆమెకు డయాబెటిక్స్ ఉందని.. కొద్దిగా బీపీ కూడా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆమెను అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచామని.. ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వారు చెప్పారు. ఆమె ఆరోగ్యంగా ఉందని  ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios