హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని  కోరుతూ 108 ఉద్యోగులు బుధవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 10 ఏళ్లుగా తమ వేతనాలు పెంచలేదని  108 ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు  తమ సమస్యలను 10 ఏళ్లుగా పరిష్కరించడం లేదని  వారు గుర్తు చేస్తున్నారు. 

కరోనా విధుల్లో  ప్రస్తుతం 108 సిబ్బంది కీలకంగా ఉన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  తాము సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో  ఒకవేళ 108 సిబ్బంది సమ్మెకు దిగితే  రోగులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే ప్రైవేట్ అంబులెన్స్ లు  కరోనా రోగుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 8601 కేసులు రికార్డయ్యాయి. 56 మంది మరణించారు. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. ప్రజలంతా అవసరం ఉంటేనే బయటకు రావాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona