తెలంగాణలో 17 వేలు దాటిన కేసులు: ఒక్క రోజులో 1,018 మందికి పాజిటివ్... ఏడుగురు మృతి
తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కేసుల సంఖ్య 17,357కి చేరింది.
ఇవాళ కరోనాతో ఏడుగురు మరణించడంతో.. మృతుల సంఖ్య 267కి చేరుకుంది. తెలంగాణలో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇవాళ 788 డిశ్చార్జ్ అవ్వడంతో కోలుకున్న వారి సంఖ్య 8,082కి చేరింది.
Also Read:సికింద్రాబాద్ కంటోన్మెంట్ హరితహరంలో కరోనా కలకలం: హోంక్వారంటైన్‌లో పలువురు
ఒక్క హైదరాబాద్‌లోనే 881 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మేడ్చల్‌లో 36, రంగారెడ్డి 33, మహబూబ్‌నగర్ 10, వరంగల్ రూరల్, మంచిర్యాలలో తొమ్మిదేసి కేసులు, ఖమ్మం 7, జగిత్యాల, నల్గొండలో నాలుగేసి కేసులు, సిద్ధిపేట, నిజామాబాద్‌లో మూడేసి కేసులు, సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రిలలో రెండేసి చొప్పున, గద్వాలలో ఒక కేసు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రెండు రోజుల క్రితం కంటోన్మెంట్ బోర్డులో హరిత హరం కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Also Read:కరోనా హెల్త్ బులిటెన్‌లో అరకొర సమాచారం: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
హరిత హరంలో పాల్గొన్న కొందరు కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు కరోనా సోకింది.దీంతో వారంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. వారంతా కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు. కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారెవరు అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.