Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ హరితహరంలో కరోనా కలకలం: హోంక్వారంటైన్‌లో పలువురు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రెండు రోజుల క్రితం హరిత హరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలకు కరోనా సోకింది. దీంతో వారంతా హొం క్వారంటైన్ లోకి వెళ్లారు.

secunderabad cantonment board members tests coronavirus
Author
Hyderabad, First Published Jul 1, 2020, 3:22 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రెండు రోజుల క్రితం హరిత హరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలకు కరోనా సోకింది. దీంతో వారంతా హొం క్వారంటైన్ లోకి వెళ్లారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.  రెండు రోజుల క్రితం కంటోన్మెంట్ బోర్డులో హరిత హరం కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

హరిత హరంలో పాల్గొన్న కొందరు కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు కరోనా సోకింది.దీంతో వారంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. వారంతా కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు. కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారెవరు అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదౌతున్నాయి. మంగళవారం నాడు ఒక్క రోజే రాష్ట్రంలో 945 కేసులునమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేేసులు 16,339కి చేరుకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios