కన్న కూతురిపైనే అమానుషంగా అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బర్వాడ్‌ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య, కూతురితో కలిసి సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్లేపల్లిలో నివసించేవాడు.


కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపై ఓ తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తన కామా వాంఛ తీర్చుకోవాడినికి కూతురిని వాడుకున్నాడు. కాగా.. ఆ కామాంధుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కన్న కూతురిపైనే అమానుషంగా అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బర్వాడ్‌ గ్రామానికి చెందిన వ్యక్తి భార్య, కూతురితో కలిసి సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్లేపల్లిలో నివసించేవాడు. 2016 సెప్టెంబరు 19న అతడు తన ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో దోషికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు, సంగారెడ్డి పోక్సో కోర్టు జడ్జి మైత్రేయి గురువారం తీర్పు చెప్పారు.