మానకొండూరు కొండపలకలో రోడ్డు ప్రమాదం: బైకర్‌ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన వాహనం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకలో బైక్ పై వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకలో బైక్ పై వెళ్తున్న యువకుడు శ్రీకాంత్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది . యువకుడిని 50 మీటర్ల దూరం ఈ వాహనం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శ్రీకాంత్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.మిషనర్ భగీరథలో పంప్ ఆపరేటర్ గా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఏదో ఒక చోట రోడ్డుప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కారణాలను పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఢీసీఎం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
ఈ నెల 9వ తేదీన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలోని కోరార్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు ఆటో, ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణీస్తున్న ఏడుగురు విద్యార్ధులు మృతి చెందారు.
also read:హైద్రాబాద్ కూకట్‌పల్లిలో పేలిన కారు టైర్: రోడ్డుపైనే పల్టీ కొట్టిన కారు
ఈ నెల 7వ తేదీన తెలంగాణలోని పెంబర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న డీసీఎం ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 5వ తేదీన హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని మరో కారును ఢీకొంది. దీంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఈ నెల 7వ తేదీన బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ నెల 6 తేదీన యూపీలోని సుల్తాన్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.