హైద్రాబాద్ కూకట్ పల్లిలో  కారు టైర్ పేలి  రోడ్డుపైనే కారు పల్టీ కొట్టింది.ఈ ప్రమాదంలో  కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.    


హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో శుక్రవారం నాడు టైరు పేలి కారు రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం కూకట్ పల్లి సర్కిల్ లో ఓ కారు టైరు పేలింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనతో కొద్ది సేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్డుపైనే పల్టీ కొట్టిన కారును తొలగించారు పోలీసులు.