ఈఎంఐ చెల్లించలేదు: మాజీ సర్పంచ్ ఇంటి తలుపులు తీసుకెళ్లిన బ్యాంకు సిబ్బంది
సకాలంలో బ్యాంకు వాయిదా చెల్లించకపోవడంతో మహబూబాబాద్ జిల్లాలో వీరేందర్ ఇంటి తలుపులు తీసుకెళ్లారు బ్యాంకు సిబ్బంది.
వరంగల్: ఈఎంఐ వాయిదా చెల్లించలేదని గ్రామీన వికాస బ్యాంకు అధికారులు మాజీ సర్పంచ్ ఇంటి తలుపులను తీసుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో మంగళవారంనాడు జరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మధనాపురం మాజీ సర్పంచ్ వీరేందర్ 2020లో గ్రామీణ వికాస బ్యాంకులో రుణం తీసుకున్నాడు.ఈ రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు ఆయనకు నోటీసుులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై తనకు సమయంలో కావాలని బ్యాంకు అధికారులను వీరేందర్ కోరారు. అయినా కూడా వాయిదాలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు మాజీ సర్పంచ్ ఇంటి తలుపులను నిన్న బ్యాంకు అధికారులు తీసుకెళ్లారు. వాయిదా చెల్లించి తలుపులు తీసుకెళ్లాలని బ్యాంకు అధికారులు వీరేందర్ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ వీరేందర్ మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లారు.