Asianet News TeluguAsianet News Telugu

జూమ్‌ వీడియో కాల్స్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఉద్యోగులు, విద్యార్థుల కోసం స్పెషల్ గా..

జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

Zoom launches immersive view that places participants in one virtual background check how to enable it
Author
Hyderabad, First Published Apr 28, 2021, 11:30 AM IST

వీడియో కాలింగ్ యాప్ జూమ్ మీటింగ్స్, ఆన్ లైన్  క్లాసెస్, కాన్ఫరెన్సెస్  మరింత ఆకర్షణీయంగా చేయడానికి కొత్తగా ఇమ్మెర్సివ్ వ్యూ అనే ఫీచర్ రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా ఆఫీస్ మీటింగ్స్ కోసం అనుకూల థీమ్‌ను సెట్ చేయడానికి లేదా ఆన్ లైన్ క్లాసెస్ కోసం  విద్యార్ధులకు క్లాస్ లో ఉండే థీమ్ లను సెట్ చేయడానికి అనుమతిస్తుంది.

ఈ ఫీచర్ ను మొట్టమొదట జూమ్‌టోపియా పేరుతో 2020 అక్టోబర్‌లో ప్రకటించారు.  ప్రస్తుతం డెస్క్‌టాప్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. మీరు హోస్ట్ చేస్తున్న ఈవెంట్‌ను బట్టి బోర్డు రూమ్, క్లాస్‌రూమ్ లేదా ఆడిటోరియం వంటి థీమ్‌లను సెట్ చేయడానికి ఇమ్మెర్సివ్ వ్యూ సహాయపడుతుంది.

జూమ్ వెర్షన్ 5.6.3 లేదా అంతకంటే ఎక్కువ వేర్షన్ ఉన్న విండోస్ అండ్ మాక్ డెస్క్‌టాప్ కోసం జూమ్ ఇమ్మర్సివ్ వ్యూను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది.జూమ్‌ ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

also read ఇండియాలోనే అతి చౌకైన ఒప్పో 5జి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. పెద్ద ర్యామ్, భారీ స్టోరేజ్ తో నేడే లాంచ్...

ఈ కొత్త జూమ్ ఫీచర్ వీడియో కాల్స్ లో  పాల్గొనేవారికి ఒకే వర్చువల్ థీమ్ ఏర్పాటు చేయడానికి హోస్ట్‌లకు మాత్రమే అనుమతిస్తుంది. ఇందుకు సెట్టింగులు> మీటింగ్స్> ఇన్‌మీటింగ్ (లేటెస్ట్)>  ఇమ్మర్సివ్ వ్యూకు వెళ్లడం ద్వారా హోస్ట్ థీమ్ ని సెట్  చేయవచ్చు.  

ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో 5 లేదా 6 స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్‌ దగ్గర(పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్‌ చేయవచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు.

అయితే దీనిలో ఎటువంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి తీసురానున్నారు. అయితే దీనికి పోటీగా ఇలాంటి ఫీచర్‌ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ‘టుగెదర్‌ మోడ్‌’ పేరుతో అందుబాటులో ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios