Asianet News TeluguAsianet News Telugu

కాల్స్ చేయడానికి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా.. బ్లూటూత్ కాలింగ్‌తో ఈ వాటర్‌ప్రూఫ్ వాచ్ పై లుక్కెయండి..

మీరు కాల్స్ చేయడానికి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే Zeb Iconic Lite మీ కోసం. ఎందుకంటే బ్లూటూత్ కాలింగ్ కూడా ఇందులో ఇచ్చారు. మీరు జీబ్రోనిక్స్ ఈ వాచ్‌తో కాల్స్ మాట్లాడవచ్చు ఇంకా రిజెక్ట్ చేయవచ్చు.

Zeb Iconic Lite with Bluetooth calling launched in India with waterproof
Author
First Published Jan 7, 2023, 8:17 PM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జీబ్రోనిక్స్ కొత్త స్మార్ట్ వాచ్  జేబ్ ఐకానిక్ లైట్ (Zeb Iconic Lite)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.  ఈ జెబ్ ఐకానిక్ లైట్  స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌, అంతేకాకుండా ఈ వాచ్‌కి 1.78-అంగుళాల ఆమోలెడ్ డిస్ ప్లే, మెటల్ బాడీ ఇచ్చారు. డిస్ ప్లేలో 2.5D కర్వ్డ్ గ్లాస్ మరో ఫీచర్ ఏంటంటే అల్వెస్  ఆన్ డిస్ ప్లే కూడా ఉంది. Zeb ఐకానిక్ లైట్ డ్యూయల్ మెనూ UIతో వస్తుంది. వాచ్‌తో 11 వాచ్ ఫేస్‌లు ఇంటర్నల్ గా యాప్‌తో 100+ వాచ్ ఫేస్‌లు  అందుబాటులో ఉంటాయి. దీని బ్యాటరీ లైఫ్ 5 రోజులుగా క్లెయిమ్ చేయబడింది. 

మీరు కాల్స్ చేయడానికి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే Zeb Iconic Lite మీ కోసం. ఎందుకంటే బ్లూటూత్ కాలింగ్ కూడా ఇందులో ఇచ్చారు. మీరు జీబ్రోనిక్స్ ఈ వాచ్‌తో కాల్స్ మాట్లాడవచ్చు ఇంకా రిజెక్ట్ చేయవచ్చు. కాల్ చేయడానికి వాచ్‌లో డయల్‌ప్యాడ్ కూడా అందించారు.

ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, అంటే మీరు గూగుల్ అసిస్టెంట్ ఇంకా ఆపిల్ సిరి రెండింటినీ ఉపయోగించవచ్చు. వాచ్‌తో మీరు ఫోన్ కెమెరాను ఇంకా మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయచవచ్చు. వాచ్‌లో రెండు ఇన్‌బిల్ట్ గేమ్‌లు కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్ పొందింది. హెల్త్ ఫీచర్స్ చూస్తే ఈ వాచ్‌లో 100+ స్పోర్ట్స్ మోడ్, హార్ట్ బీట్ రేటు, SPO2 ట్రాకింగ్, బి‌పి మానిటరింగ్, పెడోమీటర్, క్యాలరీ కౌంటర్, స్లీప్ మానిటర్ ఇంకా బ్రిథింగ్ ఎక్సైజ్ మొదలైనవి ఉన్నాయి. దీనిని  గోల్డ్-బ్లూ, సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్స్‌లో పరిచయం చేసారు. దీనితో పాటు సిలికాన్ అండ్ మెటల్  రెండు పట్టీలు లభిస్తాయి. ఈ వాచ్‌ను అమెజాన్ ఇండియా నుండి రూ.2,999 ధరతో కొనవచ్చు.

జెబ్ ఐకానిక్ లైట్ డైరెక్టర్ యష్ దోషి కొత్త ప్రాడక్ట్ లాంచ్ పై మాట్లాడుతూ  జీబ్రానిక్స్ నుండి వెరబుల్ క్లబ్‌లో మరొక ఫిట్‌నెస్ వాచ్ 'లైట్' అయినప్పటికీ ఫీచర్-రిచ్ గా ఉంటుంది. మల్టీ కలర్స్ ఇంకా బ్యాండ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మేము అందరి కోసం ZEB ఐకానిక్ లైట్‌ని పరిచయం చేసాము. Zebronics అనేది మా కస్టమర్‌ల డిమాండ్‌లతో అభివృద్ధి చెందుతున్న సంస్థ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios