ప్రపంచంలోని అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ మే 19 ఉదయం డౌన్ అయ్యింది. దాదాపు గంటసేపు స్ట్రిమింగ్ నిలిచిపోయిన తర్వాత యూట్యూబ్‌ తిరిగి పనిచేయడం ప్రారంభించింది.

 

దీనికి సంబంధించి యూట్యూబ్ ఒక ట్వీట్  ద్వారా సర్వీస్ ఆగిపోయినట్లు ధృవీకరించింది. యూట్యూబ్ డౌన్ అయిన తర్వాత #YouTubeDOWN ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.

యూట్యూబ్  యాప్, డెస్క్‌టాప్ వెర్షన్‌లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినియోగదారులు వీడియోలను చూడలేకపోవడం అలాగే లాగిన్ చేయలేకపోయాయరు. డౌన్‌డిటర్ కూడా యూట్యూబ్ డౌన్ అయినట్లు ధృవీకరించారు.

 

ఉదయం 8 గంటలకు యూట్యూబ్ డౌన్‌ అయినట్లు సుమారు 89 మంది ఫిర్యాదు చేశారు. ఉదయం 8.33 నాటికి ఫిర్యాదుల సంఖ్య 8 వేలకు పైగా పెరిగింది. వీడియో ప్లే కాకపోవడంపై 90 శాతం మంది ఫిర్యాదు చేశారు.అలాగే  2 శాతం మందికి లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.