ఇండియన్ మార్కెట్లోకి 75 అంగుళాల షియోమి ఎంఐ కొత్త క్యూలెడ్ టివి.. బడ్జెట్ ధరకే వచ్చేవారంలో లాంచ్.
చైనా కంపెనీ షియోమి ఎంఐ తాజాగా 4కె టివి సిరీస్ కింద కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి అధికారిక ట్విటర్ ద్వారా ట్వీట్ చేసింది.
ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమి ఎంఐ క్యూఎల్‌ఇడి 4కె టివి సిరీస్ కింద కొత్త వేరియంట్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు దృవీకరించింది. ఈ టివి 75 అంగుళాలతో మార్చి 23న లాంచ్ అవుతుంది. అలాగే ఈ టివి భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన టివి అవుతుంది. షియోమి ఈ రాబోయే టీవీ గురించి ట్వీట్ ద్వారా సమాచారం అందించింది.
షియోమి ఇటీవల ఎంఐ టివికి అదనంగా రెడ్‌మి స్మార్ట్ టివిని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఎంఐ క్యూఎల్‌ఇడి టివి ఫీచర్లు గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించిన ఎంఐ క్యూఎల్‌ఇడి టివి లాగానే ఉంటాయి. మార్చి 23న షియోమి భారతదేశంలో ఎంఐ 11 ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా విడుదల చేయనుంది.
75 అంగుళాల షియోమి ఎంఐ క్యూఎల్‌ఇడి టివి 4కె వేరియంట్ ధర గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు, అయితే దాని ధర బడ్జెట్ లోనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ టీవి ఫీచర్ల గురించి మాట్లాడితే దీనికి క్యూఎల్‌ఇడి స్క్రీన్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తాయి.
అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా యాక్సెస్ చేయవచ్చు. డాల్బీ విజన్ హెచ్‌డిఆర్, డాల్బీ అట్మోస్ ఆడియో టీవీలో లభిస్తుంది. ఈ టీవీ ఫీచర్స్ ఎక్కువగా భారత మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసిన మొట్టమొదటి 55 అంగుళాల ఎంఐ క్యూఎల్‌ఇడి టివి 4కె లాగానే ఉంటాయి.
ప్యాచ్‌వాల్, ఎంఐ హోమ్ యాప్ వంటి ఫీచర్లు ఈ కొత్త టీవీలో చూడవచ్చు. షియోమి 2018లో భారతదేశంలో కంపెనీ మొదటి టీవీని ప్రారంభించింది. అలాగే కేవలం మూడేళ్లలోనే కంపెనీ 6 మిలియన్లకు పైగా టీవీలను విక్రయించింది. షియోమికి భారతీయ స్మార్ట్ టివి మార్కెట్లో 25 శాతం వాటా ఉంది.