Asianet News TeluguAsianet News Telugu

భారీ కెపాసిటీతో షియోమి మొట్టమొదటి 30000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్‌ విడుదల.. ధర ఎంతంటే ?

చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ ఎం‌ఐ ఒక పవర్‌బ్యాంక్‌ను విడుదల చేసింది. ఈ పవర్‌బ్యాంక్‌ ప్రత్యేకత ఏంటంటే 30000mah కెపాసిటీతో లాంచ్ అయిన మొట్టమొదటి పవర్ బ్యాంక్ ఇది. 
 

xiaomi mi boost pro power bank with 30000mah capacity launched in india check price here
Author
Hyderabad, First Published Mar 31, 2021, 6:43 PM IST

ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ ఎం‌ఐ ఇండియాలోనే అతిపెద్ద భారీ సామర్ధ్యంగల పవర్‌బ్యాంక్‌ను లాంచ్ చేసింది. ఎం‌ఐ  బూస్ట్ ప్రో పవర్‌బ్యాంక్‌లో 30,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు పవర్ డెలివరీ (పిడి) 3.0 ను కూడా ఉంది. అంతేకాకుండా షార్ట్ సర్క్యూట్ల నుండి రక్షణగా 16 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు.

పిడి 3.0 సహాయంతో ఈ పవర్‌బ్యాంక్ 24 వాట్ ఛార్జింగ్ తో 7.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని షియోమి తెలిపింది. ఈ పవర్ బ్యాంక్‌లో లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఎం‌ఐ  బూస్ట్ ప్రో పవర్‌బ్యాంక్ ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమ్మబడుతోంది. ప్రస్తుతం ఈ పవర్‌బ్యాంక్‌ను 1,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు, అయితే తరువాత దీని ధర 3,499 రూపాయలు ఉంటుంది. దీనిని బ్లాక్ కలర్ వేరియంట్లో కనుగొలు చేయవచ్చు.

also read స్మార్ట్ ఫోన్ లవర్స్ కి పోకో ఎక్స్3 సిరీస్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం.. ...

ఎం‌ఐ  బూస్ట్ ప్రో ఫీచర్స్
ఎం‌ఐ   బూస్ట్ ప్రో పవర్‌బ్యాంక్‌కి మొత్తం మూడు పోర్టులు ఉంటాయి. వీటిలో రెండు యూ‌ఎస్‌బి పోర్టులు, ఒకటి టైప్-ఏ మరొకటి టైప్-సి పోర్టులు ఉన్నాయి. టైప్-సి పోర్ట్ ఇతర డివైజెస్ ఛార్జ్ చేయడంతో పాటు పవర్‌బ్యాంక్‌ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు. పవర్‌బ్యాంక్‌ను టైప్-సితో పాటు మైక్రో యుఎస్‌బి ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు.

ఈ పవర్‌బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. దీనివల్ల ఒకేసారి మూడు డివైజెస్ వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ పవర్‌బ్యాంక్‌తో చిన్న గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ ఫీచర్ ఉంది. పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కడం ద్వారా పవర్ బ్యాంక్ రెండు గంటల పాటు తక్కువ పవర్ మోడ్‌లోకి వెళుతుంది, ఆ తర్వాత మీరు వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios