షియోమీ నుండి అదిరిపోయే ఫీచర్లతో మరో ఎంఐ కొత్త ఫోన్...
చైనా మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ భారత వినియోగ దారులకు 108 ఎంపీ కెమెరా గల ఎంఐ నోట్10 ఫోన్లను తీసుకురానున్నది. ఈ సంగతి సంస్థ భారత్ అధిపతి మను కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత నెలలోనే గ్లోబల్ విపణిలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది షియోమీ. తన ప్రత్యర్థి వన్ ప్లస్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ షియోమీ ఇప్పటికే భారత విపణిలోకి ఈ ఏడాది వివిధ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను తీసుకు వచ్చింది. తాజాగా అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్‌ను తేనున్నది. 108 మెగా పిక్సెల్ కెమెరాతో ఎంఐ సీసీ9 ప్రో (ఎంఐ నోట్ 10) పేరిట ఇప్పటికే యూరోపియన్, చైనా మార్కెట్లలో ప్రవేశపెట్టింది.
త్వరలోనే భారత విపణిలోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. భారత్ విపణిలో ఎంఐ నోట్ 10 విడుదలపై షియోమీ భారత్ విభాగం అధిపతి మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. కానీ ఆవిష్కరణ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ నెలాఖరులోగా ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
also read ఇక స్మార్ట్ ఫోన్ లోనే ఆధార్ కార్డ్...ఎలా అంటే ?
108ఎంపీ కెమెరాతో పాటు 108ని సూచించే కెమెరా ఎమోజీలతో తీసుకువస్తున్నట్లు మనుకుమార్ జైన్ తెలిపారు. ఇంత ఎక్కువ మెగాపిక్సెల్ సెన్సార్‌తో మార్కెట్లోకి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ ఫోన్లకు నోట్ 10 గట్టి పోటీ ఇవ్వనున్నది.
ఎంఐ నోట్ 10 ఫోన్ వెనుకవైపు ఐదు కెమెరాలు ఉన్నాయి. 108 ఎంపీ కెమెరా ప్రధాన ఆకర్షణ. అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఈ మోడల్ 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను కంపెనీ 549 యూరోలుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో రూ.43,200.
8 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర 649 యూరోలు.. అంటే భారత కరెన్సీలో రూ.51 వేలు. అయితే సీసీ 9 ప్రో పేరుతో చైనా విడుదలైన ఫోన్ ధరను భారత కరెన్సీలోకి మార్చినప్పుడు దాని ధర రూ.28 వేలే. భారత విపణిలోకి వచ్చే సమయానికి ఇక్కడ ఇతర కంపెనీలతో ఉన్న పోటీ నేపథ్యంలో ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
ఎంఐ నోట్ 10 ఫోన్‌లో 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్‌తో 6.47 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 108 ఎంపీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఫోన్‌లో 20 ఎంపీ, 12ఎంపీ, 5ఎంపీ కెమెరాతోపాటు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చారు.
also read మొత్తం 120 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్...ఫోన్ నంబర్లతో సహ
2.2గిగా హెర్జ్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ తోపాటు 5260ఎంఏహెచ్ సామర్థ్యం గల నాన్ రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ గ్లాసియర్ వైట్, అరోరా గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ వంటి వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. ఎంఐ నోట్ 10తో పాటు ఎంఐ మిక్స్ ఆల్ఫా ఫోన్‌ను కూడా భారత విపణిలోకి విడుదల చేసేందుకు షియోమీ ప్రణాళికలు రూపొందిస్తోంది.