Min read

Xiaomi 15 Series షావోమి 15 సిరీస్ విడుదల, ముందే బుక్ చేస్తే బంపర్ ఆఫర్

Xiaomi 15 series launch with pre booking offers in India in telugu
Xiaomi 15 Ultra

Synopsis

షావోమి 15 సిరీస్ వచ్చేసింది. అడ్వాన్స్‌డ్ కెమెరా స్మార్ట్ ఫోన్ ప్రీ బుక్ చేస్తే, ఉచిత లెజెండ్ ఎడిషన్ ఫోటోగ్రఫీ కిట్‌తో కలిపి ₹21,999 విలువైన బెనిఫిట్స్, ₹10,999 ఆఫర్ ఇంకా చాలా మీ సొంతం అవుతాయి.

షావోమి ఇండియా ఇప్పుడు షావోమి 15 రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం షావోమి అఫీషియల్‌గా ధర ప్రకటించింది. లైకా సమ్మిలక్స్ ఆప్టికల్ లెన్స్‌లు, పవర్ఫుల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫారమ్ షావోమి హైపర్ ఓఎస్ 2తో కలిపి ఉంది. షావోమి 15 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ సామర్థ్యాలు, అప్‌గ్రేడ్ చేసిన సిస్టమ్ ఆప్టిమైజేషన్, హై కనెక్టివిటీ ఇస్తుంది. స్పెషల్ ఏంటంటే షావోమి 15 సిరీస్ ఫోన్‌ను మార్చి 19న ప్రీ బుక్ చేస్తే బంపర్ ఆఫర్ మీదే. 

ధర, ప్రత్యేకతలు
షావోమి 15, ₹64,999* నుంచి స్టార్ట్ అవుతుంది. షావోమి 15 అల్ట్రా ₹1,09,999* నుంచి ప్రారంభం అవుతోంది.
షావోమి 15 సిరీస్ ఏప్రిల్ 3, 2025 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, అఫీషియల్ రీటైల్ షాపుల్లో దొరుకుతుంది.
 
ప్రీ-బుకింగ్ మార్చి 19, 2025న మొదలవుతుంది. షావోమి 15 అల్ట్రా ప్రీ-బుక్ చేసినవాళ్లు ఫోటోగ్రఫీ కిట్-ఎజెండ్ ఎడిషన్(₹11,999 విలువ) ఎలాంటి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా పొందుతారు. షావోమి 15 ప్రీ-బుక్ చేసినవాళ్లు షావోమి కేర్ ప్లాన్ (₹5,999 విలువ) ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా అందుకుంటారు.

షావోమి 15: పర్ఫెక్ట్ రీతిలో సమగ్రమైన శ్రేష్ఠత
సరికొత్త, ఎఫెక్టివ్ డిజైన్‌లో ముందుండే ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసం డిజైన్ చేసిన షావోమి 15, 6.36-ఇంచ్ క్రిస్టల్ రెస్ డైనమిక్ 1-120 హర్ట్జ్ అమోల్డ్ డిస్‌ప్లేను 94% స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది. దీని వెరైటీ ట్రిపుల్-కెమెరా సిస్టమ్ 14ఎంఎం నుంచి 120ఎంఎం ఫోకల్ లెంగ్త్ కలిగి ఉంది. దీనితో లైకా సమ్మిలక్స్ మెయిన్ కెమెరా ఎఫ్/1.62 అపెర్చర్, లైట్ హంటర్ ఫ్యూజన్ 900 సెన్సార్ అసాధారణ ఫోటోగ్రఫీ కోసం ఉంది. 60ఎంఎం లైకా ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా క్లోజ్-అప్ ఫోటోగ్రఫీలో బెస్ట్. ఫాస్ట్ షాట్ మోడ్ యూజర్లకు కేవలం 0.6 సెకన్లలో క్షణాలను క్యాప్చర్ చేస్తుంది. 30ఎఫ్.పి.ఎస్.లో 8కె వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ 5కె 60ఎఫ్.పి.ఎస్. కలిగి ఉన్న షావోమి 15 ప్రతి ఫ్రేమ్ కూడా సినిమాటిక్‌గా ఉండేలా చేస్తుంది. 

షావోమి 15 అల్ట్రా: స్మార్ట్ ఫోన్  
షావోమి 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇమేజింగ్‌ను అత్యాధునిక టెక్నాలజీ, ప్రొఫెషనల్ లెవెల్ సామర్థ్యాలతో రీడిఫైన్ చేశారు.  దీని 1-ఇంచ్ 50ఎంపి లైకా సమ్మిలక్స్ మెయిన్ కెమెరా సోనీ ఎల్.వై.టి.-900 సెన్సార్, 14ఇవి హై డైనమిక్ రేంజ్ కలిగి ఉంది. 14ఎంఎం నుంచి 200 ఎంఎం ఆప్టికల్ క్వాలిటీ జూమ్ రేంజ్‌లో అద్భుతమైన ఫోటో క్వాలిటీ ఇస్తుంది. ఆకర్షణీయమైన భూభాగాలు, డీటైల్డ్ పోర్ట్రెయిట్ లేదా డైనమిక్ రోడ్డు ఫోటోగ్రఫీ ఏదైనా యూజర్లు ప్రొఫెషనల్ లెవెల్ రిజల్ట్స్ పొందొచ్చు. 

షావోమి 15 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్- లెజెండ్ ఎడిషన్
ఫోటోగ్రఫీ ఇష్టపడేవాళ్ల కోసం షావోమి 15 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ ఇండియాకి వచ్చేసింది. ఇది చిన్న మోడల్‌లో ప్రొఫెషనల్ క్వాలిటీ కంట్రోల్ ఇస్తుంది. షట్టర్ బటన్, గ్రిప్ డి.ఎస్.ఎల్.ఆర్. లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. బిల్ట్-ఇన్ 2000ఎంఎఎచ్ బ్యాటరీ షూటింగ్ సెషన్స్‌ను పెంచుతుంది. కస్టమైజ్ చేయగల, జూమ్ లివర్ ఎక్స్‌పోజర్, జూమ్ అడ్జస్ట్‌మెంట్‌లను అందిస్తుంది. 

Latest Videos