చైనా సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారి ఈ వారం ప్రారంభంలో తన సొంత మార్కెట్లో  డెవలపర్ కాన్ఫరెన్స్లో భాగంగా టైమింగ్ను ప్రకటించారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఏ ఫోన్ కి  ఉపయోగీస్తారో ఇంకా వెల్లడించలేదు.

 వినియోగదారులు  వీబో లో తెలిపిన నివేదికల ప్రకారం షియోమి యొక్క డెవలపర్ కాన్ఫరెన్స్‌లో  షియోమి తన 100W సూపర్ ఛార్జ్ టర్బో వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మరోసారి చూపించింది అలాగే ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోతుందని తెలిపింది. షియోమి కొంతకాలంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ పై పనిచేస్తున్నది, వచ్చే ఏడాది లోగా దీనిని అమ్మకాలలోకి తీసుకురావొచ్చు.

also read  వెంటనే వాట్సాప్‌ డిలేట్ చేయండి లేదంటే మీ ఫోటోలు,మెసేజ్లు లీక్...: టెలిగ్రామ్ సి‌ఈ‌ఓ

షియోమి కంపెనీ ప్రకారం, 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 17 నిమిషాల వ్యవధిలో పూర్తిగా ఫుల్ ఛార్జ్ చేస్తుంది. 100W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ వేగాన్ని క్లెయిమ్ చేసిన ఏకైక సంస్థ షియోమి ఒక్కటే కాదు, ఇంతకుముందు  వివో కూడా  120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది, కేవలం 13 నిమిషాల్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఛార్జ్ చేయగలదని పేర్కొంది.

షియోమి, వివో కమర్షియల్ డివైజెస్ లో  తమ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలను ఇంతకు ముందు విడుదలచేయలేదు. షియోమి మాదిరిగానే, వివో కూడా వచ్చే ఏడాది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే ఫోన్‌ను విడుదల చేయాలనుకుంటుంది.

also read  ట్రిపుల్ రియర్ కెమెరాలతో వివో U20: అతి తక్కువ ధరకే...

100w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎం‌ఐ మిక్స్ 4 మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కాగలదని వీబో లో కొంత ఉహాగానాలు వినిపిస్తున్నాయి, అయితే ఈ పుకార్లకు నమ్మదగిన ఆధారాలు లేవు. ఇదిలావుండగా షియోమి ప్రస్తుతం రెడ్‌మి K30 5Gని వచ్చే నెలలో చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫోన్ డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లేతో వస్తోందని  కొందరు చెప్తున్నారు.