రోబోల మాదిరే మానవుడి మెదడులా పని చేసే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ తొలిసారి రూపుదిద్దుకున్నది. నూతనంగా ఆవిర్భవించిన మిలియన్- ప్రాసెసర్ - కోర్ స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ (స్పిన్ నాకర్) మిషన్ సెకన్‌కు రెండు కోట్ల సార్లకు పైగా స్పందిస్తుంది. ప్రతి చిప్ కూడా కోటి ట్రాన్సిస్టర్లు కలిగి ఉంది. ఇప్పటివరకు దీని రూపకల్పనకు 1.5 కోట్ల డాలర్లు ఖర్చైంది. ఈ కాన్సెప్ట్ రూపకల్పనకు 20 ఏళ్లు పడితే, తయారీకి 10 ఏళ్లు దాటింది. 2006లో నిర్మాణం ప్రారంభించినట్లు స్పిన్ నాకర్ తెలిపింది. 

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంఛెస్టర్ యూనివర్శిటీ స్పిన్ నాకర్ మిషన్‌ను డిజైన్ చేసి, అభివ్రుద్ధి చేసింది. స్పిన్‌నాకర్ సంప్రదాయ కంప్యూటర్ల మాదిరిగా భారీ మొత్తంలో సమాచారాన్ని స్టాండర్డ్ నెట్‌వర్క్ ద్వారా బదిలీ చేయలేదు. సూపర్ కంప్యూటర్‌లో డిజైన్ చేసిన సమాంతర కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ బ్రెయిన్ ఆధారంగా కోట్ల కొద్దీ చిన్న మొత్తం సమాచారాన్ని వేలకొద్దీ విభిన్న కేంద్రాలకు పంపగల సామర్థ్యం కలిగి ఉంటుంది.  

స్పిన్‌నాకర్ కంప్యూటర్ ప్రతిపాదనను ప్రారంభంలో ప్రతిపాదించిన స్టీవ్ ఫర్బర్ స్పందిస్తూ ఒక సంప్రదాయ కంప్యూటర్ కంటే ఎక్కువగా ఒక బ్రెయిన్ మాదిరిగా పని చేసే మిషన్‌ను రూపొందించామని పేర్కొన్నారు. కోటి బయలాజికల్ న్యూరాన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశోధకులు తెలిపారు. మౌజ్ బ్రెయిన్‌లో 100 మిలియన్ల న్యూరాన్లను కలిగి ఉంటుంది. ఇది మానవుడి మెదడుకంటే 1000 రెట్లకు పైగా శక్తి కలిగి ఉంటుంది. ఇది న్యూరో శాస్త్రవేత్తలకు ఉపయోగకరంగా ఉంది. కంప్యూటర్‌లోని కోటి న్యూరాన్లు మానవుడి మెదడులోని న్యూరాన్లలో ఒక్కశాతమే. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల మెదడులో ఉద్దీపన కలిగించేందుకు ఇది ఉపకరిస్తుంది.