CEO Parag Agrawal wife: సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య అదిరిపోయే ట్విస్ట్..?

దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్ట‌ర్‌ను ఎలాన్‌ మస్క్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ట్విట్ట‌ర్‌ కొనుగోలులో.. ట్విట్ట‌ర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ భార్య వినీతా అగర్వాల్‌ కీ రోల్‌ ప్లే చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదెలా అంటారా..?
 

Who is Vineeta Agarwala.. wife of Twitter CEO

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 44 బిలియన్ డాలర్ల ట్విట్ట‌ర్ డీల్‌తో సంబంధం ఉన్న ఓ సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు ఎవరిదంటే ప్రస్తుతం ట్విట్ట‌ర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ భార్య వినీత అగర్వాల్‌ది. 

ఈ కొనుగోలులో ఆమె పాత్ర కూడా ఉందంటూ వార్తలు రావడంతో వినీత అగర్వాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. ఇప్పటికే ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ తనకు కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌పై నమ్మకం లేదని తేల్చి చెప్పారు. పరాగ్ అగర్వాల్‌పై విమర్శలు కురిపించారు. పరాగ్ కూడా ట్విట్ట‌ర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ బంగారు భవిష్యత్ అంధకారంలోకి మారుతుందని ఉద్యోగులతో జరిపిన సమావేశంలో తెలిపారు. ఈ బహిరంగ విమర్శల మధ్యలో పరాగ్ అగర్వాల్ భార్యకు ఎలాన్ మస్క్ ట్విట్ట‌ర్ కొనుగోలుకు సంబంధం ఉందంటూ వార్తలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వినీత ప్రస్తుతం అమెరికాలోని టాప్ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్(ఏ16జెడ్)లో పనిచేస్తున్నారు. ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్ల నుంచి 7.1 బిలియన్ డాలర్ల ఫండ్ వచ్చింది. ఈ ఫండ్‌లో 400 మిలియన్ డాలర్లు వినీత పనిచేసే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ నే అందించింది. ఆండ్రీసెన్ హోరోవిట్జ్ ‌లో జనరల్ పార్టనర్‌గా పనిచేస్తోన్న వినీత అగర్వాల్.. సంస్థ బయో, హెల్త్ ఫండ్‌ల పెట్టుబడులకు ఆమెనే సారధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ డీల్‌ స్వప్రయోజనాలకు అనుగుణంగా జరిగిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఫేస్‌బుక్(మెటా)కు కూడా ఆండ్రీసెన్ హోరోవిట్జ్ అతిపెద్ద సపోర్టుగా నిలుస్తోంది. ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో చేరకముందు.. వినీత హెల్త్‌కేర్ స్పేస్‌లో పలు విభాగాలలో పనిచేశారు. పేషెంట్లకు ఫిజిషియన్‌గా, హెల్త్‌కేర్ స్టార్టప్‌లకు ఆపరేటర్‌గా, గూగుల్ వెంచర్స్ లైఫ్ సైన్సెస్ టీమ్‌లో వెంచర్ ఇన్వెస్టర్‌గా పనిచేశారు. ఇలా పలు రకాల సంస్థలలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. బయోటెక్, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అయిన కైరస్‌లో ఆమె డేటా సైంటిస్ట్‌గా కూడా పనిచేశారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బయోఫిజిక్స్‌లో బ్యాచలర్ సైన్స్ డిగ్రీ పొందిన వినీత, ఆ తర్వాత హార్వర్డ్ స్కూల్, ఎంఐటీ నుంచి ఎండీ, పీహెచ్‌డీ డిగ్రీలను పొందారు. పలు కంపెనీ బోర్డులలో ఆమె సభ్యురాలిగా కూడా పనిచేశారు. బిగ్‌హాట్ బయోసైన్సెస్, మెమోరా హెల్త్, థైమ్ కేర్, పర్ల్ హెల్త్, వేమార్క్ వంటి కంపెనీల బోర్డులతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకుంది. పరాగ్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న వినీత అగర్వాల్‌కు అన్ష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు.

మస్క్ ట్విట్ట‌ర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఆ కంపెనీలో పరాగ్ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుతం ట్విట్ట‌ర్ తాత్కాలిక సీఈఓగా టెస్లా సీఈఓ పదవిలోకి రావాలని చూస్తున్నారు. ఆ తర్వాత ట్విట్ట‌ర్‌కు కొత్త సీఈఓను నియమించనున్నారు. ట్విట్ట‌ర్‌ను వదిలిపెట్టిన తర్వాత కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం పరాగ్‌కు 39 మిలియన్ డాలర్లు రానున్నట్టు తెలుస్తోంది. ఆయన మొత్తం పరిహారాలు 2021లో 30.4 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా స్టాక్సే ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios