న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ యాప్‌లు గూగుల్ పే, ఫోన్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరికల్లా పేమెంట్ ఆప్షన్‌ను తేవాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో పరీక్షించాక తర్వాత సేవలు ప్రారంభించడానికి సిద్ధం చేస్తామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ కోరారు. 

ప్రస్తుతం ఈ యాప్‌ బీటా వెర్షన్‌ను ఇండియాలో పది లక్షల మంది యూజర్లతో ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి అనుమతులు వచ్చిన వెంటనే దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు.  

డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీని మరింత సులభతరం చేయడమే తమ లక్ష్యమని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్  పేర్కొన్నారు. యూపీఐ ప్రమాణాలతో ఈ ఫీచర్‌ను సిద్ధం చేశామని, దేశంలోని బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు తెలిపారు.

ఈ యాప్ ఒకసారి అందుబాటులోకి వస్తే దేశంలోని డిజిటల్ ఎకానమీ అభివృద్ధి పరుగులు పెడుతుందని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్  అన్నారు. ఈ ఏడాది చివరల్లోనే, వచ్చే ఏడాది మొదట్లోనే వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.

ఆర్బీఐ నుంచి అనుమతులు ఎప్పుడొస్తాయి? ఎప్పుడు ప్రారంభించాలనుకుంటున్నారు? అన్ని విషయాలను వెల్లడించలేదు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చెల్లింపు సేవలు తెస్తున్నామని ప్రకటించి చాలా రోజులైనా ఇది ఆచరణలోకి రావడం లేదు. 
ఒకసారి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక దేశంలోని వినియోగదారులందరికీ ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చి డిజిటల్‌ ఎకానమీలో భాగస్వాములు అవుతామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్  చెప్పారు. 

ప్రస్తుతం వాట్సాప్‌కు దేశంలో 400 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు. తమ మెసేజింగ్‌ సేవల మాదిరిగానే సులభంగా డబ్బును ఇతరులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్  తెలిపారు. 

ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటివి ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్‌ వీటికి పోటీకి రానున్నది. అయితే, డేటా స్టోరేజీ తదితర అంశాల విషయంలో వాట్సాప్‌ చెల్లింపు సేవల ప్రారంభం నిలిచిపోయింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు నేపథ్యంలో ఈ సేవలు ఆలస్యమవుతున్నాయి. 

దీంతో పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భారత్‌లోనే భద్రపరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ గతేడాది వెల్లడించింది. ఆర్‌బీఐ నిబంధనలు అమలు చేయకుండా పేమెంట్‌ సేవలు ప్రారంభించబోమని సుప్రీం కోర్టుకు ఈ ఏడాది మేలో తెలియజేసింది.