ప్రస్తుత కాలంలో వాట్సాప్ వాడని వారు ఎవరైనా ఉన్నారా..? అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్.. ఆ ఫోన్ లో వాట్సాప్ కామన్ గా ఉంటున్నాయి. అంతలా వాట్సాప్ ప్రజలకు చేరువయ్యింది. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను ప్రవేశపెడుతూ... వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా... మరో ఫీచర్ ని తీసుకురావడానికి వాట్సాప్ యోచిస్తోంది.

సాధారణంగా వాట్సాప్ లో మనం మెసేజ్ లు, వీడియోలు, ఆడియోలు పంపుకుంటూ ఉంటాం. మనం పంపే టెక్ట్స్ మెసేజ్ లోగానీ, వీడియోలో గానీ ఏవైనా తప్పులు ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవడానికి వీలు ఉంది. కానీ ఆడియో మెసేజ్ లో ఆ సౌలభ్యం లేదు. వాయిస్ మెసేజ్ లో తప్పులు మనం చెక్ చేసుకోడానికి వీలు లేదు. 

అందుకే... ఈ వెసులుబాటును ఇప్పుడు వాట్సాప్ తీసుకురావాలని చూస్తోంది. ఆడియో రికార్డింగ్‌ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.