సోషల్ మీడియా దిగ్గజం, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్  వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌తో పాటు పిసిలోని యాప్‌లతో సహ సమస్యలను ఎదురుకొంటున్నట్లు నివేదించారు.

ఇన్‌స్టాగ్రామ్ అలాగే ఫేస్‌బుక్ వినియోగదారులు న్యూస్ ఫీడ్‌ను అప్‌డేట్ చేయలేకపోగా, వాట్సాప్ యూజర్లు ఎలాంటి మెసేజులను పంపలేకపోతున్నట్లు అలాగే రిసీవ్ చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు.

ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెక్టర్ ప్రకారం 38వేల మందికి పైగా ప్రజలు వాట్సాప్‌లో సమస్యలను ఎదురుకొంటున్నట్లు నివేదించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ విషయానికొస్తే ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ 30వేల మందికి పైగా ఫేస్‌బుక్  1,600  పైగా నివేదికలు నమోదు చేయబడ్డాయి.

also read వాట్సాప్ ఓపెన్ చేయకుండా, టైప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కి ఎలా మెసేజ్ చేయాలో ఈ ట్రిక్ తెలుసుకోండి ...

ప్రస్తుతానికి ఈ అంతరాయంపై ఫేస్‌బుక్ అధికారికంగా స్పందించలేదు. అయితే దేశవ్యాప్తంగా ప్రజలు ట్విట్టర్‌లో దీని గురించి ట్వీట్ చేస్తున్నారు. డౌన్‌డెక్టర్‌లో చూపిన డేటా ప్రకారం 67 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్ ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేకపోగా, 19% మంది తమ ఖాతాలకు లాగిన్ అవ్వలేకపోతున్నాట్లు తెలిపింది.

మిగిలిన 13% మంది ఇన్‌స్టాగ్రామ్.కామ్ స్పందించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఫేస్‌బుక్ వినియోగదారుల విషయానికొస్తే వెబ్‌సైట్‌లో అలాగే మొబైల్ యాప్‌లో మొత్తం బ్లాక్అవుట్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు.