వాట్సాప్ అలెర్ట్: ఈ యాప్‌కు దూరంగా ఉండండి.. హెచ్చరించిన టెలిగ్రామ్ ఫౌండేర్..
టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ మాట్లాడుతూ యూజర్లు ఏ మెసేజింగ్ యాప్ ఉపయోగిస్తున్నా సరే టెలిగ్రామ్‌ను ఉపయోగించమని తాను కోరడం లేదని అయితే వాట్సాప్‌కు దూరంగా ఉండాలని అన్నారు.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వాట్సాప్ యూజర్లను మరోసారి హెచ్చరించారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్‌కు దూరంగా ఉండాలని వాట్సాప్ యూజర్లను పావెల్ డ్యూరోవ్ సూచించాడు అలాగే హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల ఫోన్‌లను సులభంగా హ్యాక్ చేయగలరని ఇంకా వారి డేటాను కూడా యాక్సెస్ చేయగలరని పేర్కొన్నారు. యూజర్లు ఏ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించినా సరే టెలిగ్రామ్‌ను ఉపయోగించమని తాను కోరడం లేదని, అయితే వాట్సాప్‌కు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. గతంలో కూడా చాలా సార్లు వాట్సాప్ గురించి అప్రమత్తంగా ఉండాలని పావెల్ పేర్కొన్నారు.
టెలిగ్రామ్ ఫౌండేర్ పావెల్ దురోవ్ వాట్సాప్‌ను ఉటంకిస్తూ గత వారం వాట్సాప్ సెక్యూరిటి సమస్యను బహిర్గతం చేసిందని చెప్పారు. నిజానికి వాట్సాప్ వీడియో కాల్‌లో లోపం కనుగొనబడింది, ఈ కారణంగా హ్యాకర్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రిమోట్ కోడ్‌ను స్థిరీకరించవచ్చని హెచ్చరిక జారీ చేయబడింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా హ్యాకర్ల దాడి గురించి హెచ్చరికలు జారీ చేసింది.
పావెల్ దురోవ్ గతంలో చాలాసార్లు వాట్సాప్‌పై విమర్శలు చేశారు. వాట్సాప్ పనిచేసే విధానంలో ప్రాథమిక మార్పులు చేస్తే తప్ప ఎప్పటికీ సురక్షితం కాదని పావెల్ గతంలో పేర్కొన్నాడు. టెలిగ్రామ్ యాప్ ప్రైవసీ ఫస్ట్ పాలసీకి ప్రసిద్ధి చెందింది. టెలిగ్రామ్‌కి ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా ఆక్టివ్ యూజర్లు ఉన్నారు. అలాగే టెలిగ్రామ్‌లో రోజుకు 20 లక్షల మంది యూజర్లు పెరుగుతున్నారు.