ఫోన్ పే, గూగుల్ పేకి ఏమైంది.. UPI లావాదేవీ ఒక్కసారిగా డౌన్.. షాక్‌కు గురైన కస్టమర్లు..
UPI లావాదేవీ అకస్మాత్తుగా ఆగిపోయింది. దింతో వినియోగదారుల మధ్య సందడి నెలకొంది. అయితే ఇలా ఎందుకో జరిగిందో తెలుసా...
ఫోన్ పే, గూగుల్ పే, BHIM వంటి UPI యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరగడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X(ట్విట్టర్)లోని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. యూపీఐ పేమెంట్ సర్వీస్‌ను ఉపయోగించలేకపోతున్నామని యూజర్లు ఫిర్యాదు చేసారు. ఇక పేటీఎం పేమెంట్ బ్యాంక్ బ్యాన్ కూడా చేయబడింది.
PhonePe, Google Pay, BHIM మొదలైన UPI ఎనేబుల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరగనందున UPI వినియోగదారులు చాలా ఆందోళన చెందారు. ఇంతకుముందు పేటీఎం పేమెంట్ బ్యాంకుపై నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడంలో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
వివిధ నివేదికల ప్రకారం, “చాలా బ్యాంక్ సర్వర్లు డౌన్‌లో ఉన్నాయి. దీంతో యూపీఐ సహా ఇతర బ్యాంకింగ్ సేవలు కొద్దిసేపు నిలిచిపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల సర్వర్లు పడిపోయాయి. బ్యాంకింగ్ సేవల అంతరాయం కారణంగా ఆన్‌లైన్ చెల్లింపు సేవ UPI కూడా ప్రభావితమైంది.
UPI సర్వీస్ నిలిపివేత గురించిన సమాచారం డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా నిర్ధారించబడింది. నివేదిక ప్రకారం, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులు యుపిఐ సర్వీస్ అంతరాయం కారణంగా సమస్యలను ఎదురుకొన్నారు. దీని వల్ల నగదు లావాదేవీలు చేయడంలో సమస్య ఏర్పడింది అని సమాచారం.