మోటో జి73 స్మార్ట్‌ఫోన్ మార్చి 10న భారతదేశంలో లాంచ్ కానుంది. మోటో స్మార్ట్‌ఫోన్ ప్రియులు గమనించాల్సిన కీలక విషయాలు  చూస్తే  రాబోయే స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మోడల్‌తో ఒకేలా ఉంటుంది. 

లేనోవో యజమాన్యంలోని మోటోరోల మోటో జి73 5జి అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 10న భారతదేశంలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీనిని ఇంతకుముందు జనవరిలో గ్లోబల్ మార్కెట్లలో Moto G73 5G ఫోన్‌ను విడుదల చేసింది.

కొత్త మోటరోల స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌తో పాటు వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఇతర Motorola 5G స్మార్ట్‌ఫోన్‌ల లాగానే రాబోయే Moto G73 ఫోన్‌లో దాదాపు 13 5G బ్యాండ్‌లు ఉన్నాయని తెలిపింది. భారత మార్కెట్‌లో G73 లాంచ్‌ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Moto G73 5G ఫోన్ ఫోటో కొన్ని వెబ్ సైట్‌లలో కూడా కనిపించింది. దీన్ని పరిశీలిస్తే, రాబోయే స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మోడల్‌తో ఒకేలా ఉంటుంది. నీలిరంగు రంగుతో కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, కానీ కస్టమర్‌లు మరిన్ని కలర్స్ లో ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లను పొందవచ్చు. 

ముందు భాగంలో పంచ్ కటౌట్‌ ఉంటుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా సెటప్ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ రంగుపై ఆధారపడి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ప్రాథమిక కెమెరా ఇంకా అల్ట్రా-వైడ్ కెమెరాల కోసం రెండు వేర్వేరు పెద్ద కటౌట్‌లు ఉన్నాయి.

ఫోన్ గురించి అంచనాలు నిజమైతే Moto G73 6.5-అంగుళాల పూర్తి HD+ LCD డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రవొచ్చు. 

33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీ పొందవచ్చు. ముఖ్యంగా, Moto G73 ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కూడిన స్టీరియో స్పీకర్లతో ఉంటుందని భావిస్తున్నారు. ఛార్జింగ్ కోసం USB టైప్-C 2.0 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ కూడా అందించవచ్చు. ఫోన్ ప్యానెల్ ప్లాస్టిక్‌గా ఉంటుంది కానీ వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో ఉంటుంది.

భారతదేశంలో Moto G73 5G స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.20,000 ఉండవచ్చు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో EUR 299కి విడుదల చేయబడింది. దీనిని భారత కరెన్సీలో సుమారు రూ.26,600. Moto G73 5G 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ తో సింగిల్ మోడల్‌లో ప్రవేశపెట్టవచ్చు.

ఇతర Motorola స్మార్ట్‌ఫోన్‌ల లాగానే G73 5G ఫోన్ కూడా Moto ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించబడుతుంది. Moto G72 స్మార్ట్ ఫోన్ ధర రూ.18,999.