జియోకి వొడాఫోన్ షాక్..రూ.99కే నయా ప్లాన్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 14, Aug 2018, 11:33 AM IST
Vodafone's Rs 99 prepaid recharge offer comes with unlimited calling
Highlights

 ప్రధాన పట్టణాలలో సైతం సిగ్నల్స్ సమస్య తలెత్తడంతో.. కష్టమర్లు వొడాఫోన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక జియోని చాలా మంది పర్మినెంట్ నెట్ వర్క్ కన్నా.. ఆప్షనల్ నెట్ వర్క్ గా మాత్రమే ఉపయోగిస్తుండటం విశేషం. 

ప్రముఖ టెలికాం దిగ్గజం జియో కి మరో టెలికాం సంస్థ వొడాఫోన్ షాకిచ్చింది. జియోకి పోటీగా సరికొత్త ప్లాన్ ని వొడాఫోన్ ప్రవేశపెట్టింది. రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన​ తరహాలో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్‌, జియో తరహాలో డేటా, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్‌లో అందించడం లేదు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులు.  కస్టమర్లు రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్  ఈ ప్లాన్‌ స్పెషాలిటీగా చెప్పాలి.  వొడాఫోన్ వెబ్‌సైట్‌, యాప్‌లో  ఈ ప్లాన్‌ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్‌ కల్పించింది.

మరోవైపు  99 రూపాయలకు ఎయిర్‌టెల్‌ 1 జీబీ డేటా,  రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో  రూ. 98 ప్లాన్‌లో 1 జీబీ డేటా,  రోజుకు 300ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. 

ఇదిలా ఉండగా.. ఎయిర్ టెల్, ఐడియా నెట్ వర్క్ లు పూర్తిస్థాయిలో సిగ్నల్స్ ని అందించడం లేదు. ప్రధాన పట్టణాలలో సైతం సిగ్నల్స్ సమస్య తలెత్తడంతో.. కష్టమర్లు వొడాఫోన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక జియోని చాలా మంది పర్మినెంట్ నెట్ వర్క్ కన్నా.. ఆప్షనల్ నెట్ వర్క్ గా మాత్రమే ఉపయోగిస్తుండటం విశేషం. 

loader