మీరు వోడాఫోన్ ఐడియా  వినియోగదారుల... ప్రతినెల రీఛార్జ్  గురించి ఆందోళన చెందుతున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. వోడాఫోన్ ఐడియా  వినియోగదారులకు వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ కాకుండా మీరు ఏ యుపిఐ ఫ్లాట్ ఫార్మ్ నుండి అయిన రీఛార్జ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ఇంకా ప్రీ-పెయిడ్ కస్టమర్‌లు మాత్రమే  ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యం  వల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు రీఛార్జ్ కోసం   ఏ‌టి‌ఎం, ఓ‌టి‌పి వంటి ఇతర వివరాలు ఎంటర్ చేయవలసీన ఆవసరం లేదు. 

వాట్సాప్ ద్వారా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు రీఛార్జ్ చేయడం ఎలా?
మొదట ఫోన్‌లో 96542-97000 నంబర్‌ను సేవ్ చేయండి. దీని తరువాత వాట్సాప్‌కు వెళ్లి  ఆ నంబరుకు "హవ్ టు పే బిల్స్ " అని మెసేజ్ పంపండి. దీని తరువాత కంపెనీ నుండి చాలా ఆప్షన్స్ తో కూడిన ఒక మెసేజ్ వస్తుంది. మీరు వాట్సాప్ ద్వారా మీ నంబర్‌ లేదా మరేదైనా నంబర్‌కి  రిచార్జ్ చేయాలీ అని అడుగుతుంది.

also read సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లేతో రియల్‌మీ 8 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు మీకోసం.. ...

మీరు మీ నంబర్ కి రిచార్జ్ చేయాలనుకుంటే, 1 ఆప్షన్ ఎంచుకొని రిప్లయి పంపండి.  మీరు పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ అయితే మీకు రిచార్జ్ కోసం  లింక్ వస్తుంది. ఇక్కడ మీరు లింక్ క్లిక్ చేశాక మీకు ఆప్షన్స్  వస్తాయి.  

మీరు వోడాఫోన్ ఐడియా  ప్రీ-పెయిడ్ కస్టమర్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు మొదట హవ్ టు రీఛార్జ్ ఎలా టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత మొదటి రీఛార్జ్ ప్లాన్ అడుగుతుంది  దాని తరువాత మెసేజ్ ద్వారా పేమెంట్ గేట్‌వేకి లింక్ పొందుతారు. దీని తరువాత, మీరు పేమెంట్ చేశాక రీఛార్జ్ పొందుతారు.

ఇటీవల వోడాఫోన్ ఐడియా  ఫ్యామిలి పోస్ట్‌పెయిడ్ ప్లాన్  ధరల పెంపును దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్‌లలో విడుదల చేసింది. వోడాఫోన్ ఐడియా  రెండు ఎంట్రీ లెవల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధరలు ఇప్పుడు రూ .598 నుండి రూ .649 కు, రూ .699 నుండి రూ .799 కు పెరిగాయి. ఈ ప్లాన్ ధరలను మొదట చెన్నై, తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్ర & గోవాలో పెంచారు.