Asianet News TeluguAsianet News Telugu

వివో కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ట్రిపుల్ కెమెరాతో బిగ్ స్టోరేజ్ ఫాస్ట్ చార్జింగ్ కూడా..

 వివో వి21ఎస్ లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, అంతేకాకుండా వివో ఈ ఫోన్‌లో ఆమోలెడ్ డిస్ ప్లే ఇచ్చింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే వస్తుంది.

Vivo V21s 5G smartphone launched with 64 megapixel camera
Author
First Published Nov 18, 2022, 12:25 PM IST

చైనా మల్టీ నేషనల్ టెక్నాలజి కంపెనీ వివో కొత్త బడ్జెట్ 5జి ఫోన్ వివో వి21ఎస్ 5జిని లాంచ్ చేసింది. వివో వి21ఎస్ 5జి ప్రస్తుతం తైవాన్‌లో ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్‌   వివో వి21ఎస్ 5Gలో అందించారు. అంతేకాకుండా వివో ఈ ఫోన్‌లో ఆమోలెడ్ డిస్ ప్లే ఇచ్చింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, రెండు కలర్స్ లో పరిచయం చేసింది.

 వివో వి21ఎస్ 5G ధర
 వివో వి21ఎస్ 5G ధర 11,490 తైవాన్ డాలర్లు అంటే దాదాపు రూ.30,000. ఈ ఫోన్ కలర్‌ఫుల్ అండ్ డార్క్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.

 వివో వి21ఎస్ 5G ఫీచర్స్ 
 వి21ఎస్ 5G స్పెసిఫికేషన్‌లో ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12, మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్, ఫోన్‌లో 128జి‌బి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అంతేకాకుండా 2404x1080 పిక్సెల్‌ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది.

 వివో వి21ఎస్ లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 44-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ కోసం ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 5G, బ్లూటూత్ v5.1, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఎన్‌ఎఫ్‌సి, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5ఎం‌ఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4000mAh బ్యాటరీ అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios